‘The Warrior’ Proves Telugu Audience Are Movie Lovers – Ram Pothineni at Success Meet..

పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. ఇందులో కృతి శెట్టి కథానాయిక.

ఆది పినిశెట్టి విలన్. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది. సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఉస్తాద్ రామ్ మాట్లాడుతూ ”సినిమా విడుదల సమయంలో వర్షాలు ఉన్నాయి.

అడ్డంకులు చాలా వచ్చాయి. లాస్ట్ మినిట్ డిజిటల్ ప్రింట్స్ వెళ్ళే వరకూ ఏదో ఒకటి వస్తూ ఉంది. మా టీమ్ అంతా వారియర్స్‌లా నిలబడ్డారు. ఫైనల్లీ రిలీజ్ చేశారు. అదే పెద్ద సక్సెస్ అనుకున్నా. అటువంటి సమయంలో ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా విడుదల చేయాలా? వద్దా? అనే సందేహం వస్తుంది. కొవిడ్ వచ్చినా… వర్షాలు వచ్చినా… ఏం వచ్చినా… థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని ‘ది వారియర్’ మరోసారి ప్రూవ్ చేసింది. వర్షాలు చూసి సినిమా వాయిదా వేయాలా? అనే ఆలోచనలో పడ్డాం. కానీ, మేం గట్టిగా నమ్మాం. ప్రేక్షకులు వస్తారని అనుకున్నాం. ఫస్ట్ డే అదే ప్రూవ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొంత మంది ప్రేక్షకులు సినిమా చూడలేకపోయారు. వాళ్ళందరూ కూడా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతల గురించి చెప్పాలి. అందరూ అనుకుంటున్నట్టు నేనూ నెక్స్ట్ సినిమా వాళ్ళకు చేస్తున్నాను. లింగుస్వామి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ‘ది వారియర్’తో కృతి అందరికీ బేబీ అయిపోయింది. ఆది పినిశెట్టి ప్రాణం పెట్టి సినిమా చేశారు” అని అన్నారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ”నాకు చాలా సంతోషంగా ఉంది. నా తొలి తెలుగు చిత్రమిది. రామ్ లాంటి మంచి హీరో, శ్రీనివాసా చిట్టూరి లాంటి నిర్మాత, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, మంచి టెక్నీషియన్స్ నాకు లభించారు. ‘పందెం కోడి’, ‘ఆవారా’, ‘రన్’ సినిమాలను ఎలా రిసీవ్ చేసుకున్నారో… అలా ఈ సినిమాకు చాలా పెద్ద ఆదరణ లభించింది. ఈ ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. మీ ప్రేమకు థాంక్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో సంధ్య థియేటర్లో చూశా. ఆ క్రౌడ్, ఆ ఓపెనింగ్ సూపర్. హీరో రామ్ క్రేజ్ తెలుసు. తమిళంలో విజయ్, అజిత్ లాంటి మాస్ హీరోలకు ఎలాంటి క్రౌడ్ వస్తుందో… అటువంటి మాస్ క్రౌడ్ మధ్య చూశా. ప్రేక్షకులు ఎక్కడ కనెక్ట్ అవుతారని అనుకున్నారో అక్కడ కనెక్ట్ అవుతారు. తమిళనాడులో కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇక్కడ వచ్చిన రిజల్ట్ చూసి సంతోషం వేసింది. మా నిర్మాతలతో ఇంకా సినిమాలు చేస్తాను. వాళ్ళతోనే నా నెక్స్ట్ సినిమా. సినిమాపై వాళ్ళకు ఉన్న ప్యాషన్, ప్రేమ వల్లే ఇంత హిట్ వచ్చింది” అని అన్నారు. కృతి శెట్టి మాట్లాడుతూ ”డాక్టర్లలో ఒక క్యూట్ నెస్ ఉంటుంది. వాళ్ళు ప్యూర్. ఆ క్యూట్ నెస్ రామ్ బాగా క్యారీ చేశారు. పోలీస్ లో ఉన్న పర్ఫెక్షన్ కూడా బాగా క్యారీ చేశారు. ఆయనతో నటించడం బావుంది. గురు పాత్రలో ఆది పినిశెట్టిని తప్ప ఇంకొకరిని ఊహించలేం. లింగుస్వామి గారికి థాంక్స్. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇచ్చారు. మా నిర్మాతలు పవన్ కుమార్, శ్రీనివాసా చిట్టూరితో మళ్ళీ మళ్ళీ పని చేయాలనుందని లింగుస్వామి గారు చెప్పారు. నేనూ అదే అనుకున్నాను. వాళ్ళ నిర్మాణంలో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఐయామ్ సో హ్యాపీ. ఎప్పుడూ పాజిటివ్ గా ఉండే పవన్ కుమార్, శ్రీనివాసా చిట్టూరి గారికి థాంక్స్. మా సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్” అని అన్నారు.ఆది పినిశెట్టి మాట్లాడుతూ ”ప్రేక్షకులు అందరికీ థాంక్స్. పక్కా కమర్షియల్ సినిమాలు ఏమేం కావాలో అవన్నీ ‘ది వారియర్’లో ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. చూసిన వారంతా బావుందని అంటున్నారు. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. వర్షాల్లో సినిమా విడుదలైనా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తర్వాత రోజు మరింత పికప్ అయ్యింది. ప్రేక్షకులకు థాంక్స్. ఇటువంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాతలు పవన్ కుమార్, శ్రీనివాసా చిట్టూరి గారికి థాంక్స్. అందరూ చెబుతున్నట్టు మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే ఒక ప్రొడక్షన్ హౌస్ ఇది. వాళ్ళతో నా రెండో చిత్రమిది. చాలా ఖర్చు పెట్టి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. గురు గురించి అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం గురు లింగుస్వామి. కమర్షియల్ సినిమాలకు ఆయన ల్యాండ్ మార్క్. ఆయన చేసిన ప్రతి సినిమా చూసి ఉంటారు. ఆడియన్స్ పల్స్ తెలుసుకుని షూట్ చేస్తారు. బ్రదర్ రామ్, కృతి… అందరితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్” అని అన్నారు. ఈ సక్సెస్ మీట్‌లో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, చిత్ర సమర్పకులు పవన్ కుమార్, ఫైట్ మాస్టర్ విజయ్, కళా దర్శకుడు డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Hi! I just wish to give you a huge thumbs up for the excellent info you have got here on this post. I will be coming back to your web site for more soon.
I was extremely pleased to discover this site. I wanted to thank you for ones time for this particularly wonderful read!! I definitely loved every little bit of it and I have you bookmarked to see new stuff on your blog.