“RRR” – ‘Sky is the limit’ Zoo. NTR Massive Craze ..!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు ఎంతో ఆసక్తిగా అవైటెడ్ గా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం”. తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో హీరోలుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ మల్టీ స్టారర్ మరికొన్ని రోజుల్లో ఇండియన్ సినిమా దగ్గర సరికొత్త లెక్కలు సెట్ చేసేందుకు వస్తుంది.
అయితే ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటించిన మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అయితే అంతా ఇంతా కాదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్ లో అయితే తెలుగు వాడి ప్రేమ తన అభిమాన హీరోపై ఏ లెవెల్లో ఉంటుందో రుచి చూపిస్తున్నారు.
ఆల్రెడీ ఎన్టీఆర్ పై తమంత తామే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ చేస్తుండగా ఇప్పుడు అయితే ఏకంగా ఒక విమానంతో “తొక్కుకుంటూ పోవాలే” అనే ఎన్టీఆర్ డైలాగ్ ని ఆకాశంలో ఎగరేసి మరీ తమ ప్రేమని చాటుకున్నారు. దీనితో ఈ మాసివ్ క్రేజ్ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే తారక్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.