Kiran Abbavaram starrer “Rules Ranjan” first look poster released…

0

యస్.ఆర్.కళ్యాణ్ మండపం’ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన

“సమ్మతమే”చిత్రం సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా సినిమా తర్వాత సినిమా చేస్తూ ఎంతో బిజీగా మారిన నటుడు కిరణ్ అబ్బవరం. ఈ రోజు తన బర్త్‌ డే సందర్భంగా తను తాజాగా నటిస్తున్న ‘రూల్స్ రంజన్’. సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘డి.జె.టిల్లు’ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ నేహా శెట్టి కథానాయికగా నటించనుంది.ఇంకా వెన్నెల కిషోర్,హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్),అతుల్ పర్చురే (బాలీవుడ్) ,ఆశిష్ విద్యార్థి, అజయ్ వంటి టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన నటీనటులతో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై రూపొందుతోంది. .తాజాగా శుక్రవారం (జూలై 15) కిరణ్‌ అబ్బవరం బర్త్‌ డే సందర్భంగా విడుదలైన ‘రూల్స్ రంజన్ ’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం బిజినెస్ మ్యాన్ సూట్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. తను ఇంతవరకు మాస్ సినిమాలే ఎక్కువగా చేసినా క్లాస్ పీపుల్స్ ను కూడా ఆకట్టుకున్నాడు.ఇప్పుడు మాస్ టచ్ తో పూర్తి క్లాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అమ్రేష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు దులీప్ కుమార్ సినిమాటోగ్రఫర్‌. వరప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *